టోరెంట్ వెబ్ సైట్ 'కికాస్' యజమాని అరెస్టు | Alleged Owner of World's Biggest Piracy Website 'Kickass Torrents' Arrested | Sakshi
Sakshi News home page

టోరెంట్ వెబ్ సైట్ 'కికాస్' యజమాని అరెస్టు

Jul 21 2016 6:45 PM | Updated on Aug 20 2018 4:44 PM

టోరెంట్ వెబ్ సైట్ 'కికాస్' యజమాని అరెస్టు - Sakshi

టోరెంట్ వెబ్ సైట్ 'కికాస్' యజమాని అరెస్టు

ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ పైరసీ వెబ్ సైట్ kickass.com యజమానిని పోలెండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వాషింగ్టన్: ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ పైరసీ వెబ్ సైట్ kickass.com యజమానిని పోలెండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఒక బిలియన్ డాలర్లు ఖరీదైన సినిమాలు, మ్యూజిక్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ తదితరాలను కికాస్ ద్వారా పైరసీ చేసినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ఉక్రయిన్ జాతీయుడైన ఆర్టెమ్ వాలిన్(30) ను పోలెండ్ లోని వార్సా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్, యూఎస్ కాపీరైట్స్ కు వ్యతిరేకంగా వెబ్ సైట్లో సమాచారాన్ని ఉంచడం వంటి కేసులు ఆర్టెమ్ పై యూఎస్ అధికారులు నమోదు చేశారు.

వెబ్ సైట్ ను ఉపయోగించే వినియోగదారులకు అనుకూలంగా సెర్చ్ ఆప్షన్స్ ను కికాస్ లో ఉపయోగించారని ఇది యూఎస్ కాపీరైట్స్ కు విరుద్ధంగా చేశారని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రపంచంలోనే ఎక్కువమంది వీక్షించే వెబ్ సైట్లలో కికాస్ 69వ స్థానానికి చేరిందని తెలిపింది. తరచుగా డొమైన్లను సీజ్ చేస్తుండటం, కేసుల కారణంగా వాలిన్ వివిధ దేశాలకు సర్వర్లను మార్చివేశాడని చెప్పింది.

చికాగో కోర్టులో వాలిన్ పై కేసు నమోదుకావడంతో పోలెండ్ అధికారులతో చర్చలు జరిపి వాలిన్ ను అదుపులోకి తీసుకుఇన విచారించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ విభాగం భావిస్తోంది. వాలిన్ ఆపిల్ అకౌంట్ ను గుర్తించిన అమెరికా పోలీసులు కొన్నివివరాలను సేకరించారు. మొత్తం 28 భాషల్లో కికాస్ రన్ అవుతున్నట్లు గుర్తించారు. కికాస్ సంవత్సర ఆదాయం 54 మిలియన్ డాలర్లు కాగా, కేవలం యాడ్ ల ద్వారా 12.5 నుంచి 22.3 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది.

బ్రిటన్, ఐర్లాండ్, ఇటలీ, డెన్మార్క్, బెల్జియం, మలేసియాలు పలుమార్లు కికాస్ ను బ్లాక్ చేయడంతో సర్వర్ డొమైన్లను వేరే దేశాలకు మార్చినట్లు గుర్తించారు. కొత్తగా విడుదలై థియేటర్లలో నడుస్తున్న కెప్టెన్ అమెరికా:సివిల్ వార్, నౌ యూ సీ మీ2, ఫైండింగ్ డోరీ తదితర చిత్రాలకు చెందిన పైరసీ ప్రింట్లు వెబ్ సైట్లో డౌన్ లోడింగ్ కు ఉండటాన్ని గుర్తించారు. 2008లో క్రిప్టోనీట్ పేరుతో కికాస్ ను వాలిన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
, కికాస్, ఆర్టెమ్ వాలిన్, అరెస్టు

Advertisement
 
Advertisement
Advertisement