Kickass Torrents
-
కికాస్ టోరెంట్స్ వచ్చేసిందోచ్
టోరెంట్ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది వినియోగించే kickass.to(KAT) కొత్త డొమైన్ తో తిరిగి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఏడాది జులైలో ఈ వెబ్ సైట్ నిర్వహకుడిని ఆర్టెమ్ వాలిన్ ను పోలెండ్ లో అరెస్టు చేసిన అమెరికా పోలీసులు తర్వాత వెబ్ సైట్ ను పూర్తిగా మూసేశారు. దీంతో కికాస్ పేరిట పలు మిర్రర్ వెబ్ సైట్లు నెట్ లో దర్శనమిచ్చాయి. పాత కికాస్ వెబ్ సైటుకు పనిచేసిన టీం మళ్లీ ఏకమై katcr.co పేరుతో మరో కొత్త డొమైన్ ను ప్రారంభించింది. పాత కికాస్ వెబ్ సైట్ తరహాలోనే ఉన్న కొత్త సైట్లో కూడా ఇతరులతో చర్చించి టోరెంట్ ఫైళ్లు షేర్ చేసుకోవచ్చు. అయితే, వినియోగదారుల తాకిడి అధికంగా ఉండటంతో వెబ్ సైట్ తొందరగా స్పందించడం లేదు. -
టొరంట్జ్.ఈయూ దుకాణం బంద్!
మెటా సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ టొరంట్జ్.ఈయూ తన సేవలను చాలించుకుంది. రోజూ లక్షలమంది నెటిజన్లు సందర్శించే ఈ వెబ్సైట్ తాజాగా వీడ్కోలు పలికింది. 'టోరంట్జ్ మిమ్మల్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటుంది. వీడ్కోలు' అంటూ వెబ్సైట్ హోమ్‌పేజీలో ఓ సందేశాన్ని ఉంచింది. కిక్ఆస్ టొరంట్స్ స్థాపకుడిగా భావిస్తున్న అర్టెం వౌలిన్ను పోలాండ్‌లో అరెస్టుచేసిన నేపథ్యంలో ఆ వెబ్సైట్ మూతపడిన సంగతి తెలిసిందే. కిక్ఆస్ దారిలోనే సాగుతూ టొరంట్జ్ కూడా మూతపడింది. 2003లో ఏర్పడిన టొరంట్జ్ అనతికాలంలోనే టొరంట్స్ సైట్లలో అత్యధికమంది వీక్షించే వెబ్‌సైట్‌గా ఖ్యాతి గడిచింది. సినిమా డౌన్లోడ్లు, ఫైల్స్ షేరింగ్ వంటి పైరసీ లింకులకు అడ్డగా నిలిచిన టోరంట్జ్ 13ఏళ్లపాటు సేవలందించింది. టోరంట్జ్ హోమ్‌పేజీ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. సెర్చ్ ఫాంక్షనాలిటీని పూర్తిగా తొలగించారు. అలాగే టొరంట్స్ లింకులన్నింటినీ తీసివేశారు. డజన్లకొద్దీ సెర్చ్ ఇంజిన్ల సేవలన్నింటినీ కలుపుకొని ఒకవేదికగాపై కావాల్సిన లింక్స్ అందించే శక్తిమంతమైన మెటా సెర్చ్ ఇంజిన్‌గా టొరంట్జ్ ఇన్నాళ్లు ఉచిత సేవలు అందించినట్టు నిర్వాహకులు తాజాగా తెలిపి.. వీడ్కోలు సందేశాన్ని ఉంచారు. -
టోరెంట్ వెబ్ సైట్ 'కికాస్' యజమాని అరెస్టు
వాషింగ్టన్: ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ పైరసీ వెబ్ సైట్ kickass.com యజమానిని పోలెండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఒక బిలియన్ డాలర్లు ఖరీదైన సినిమాలు, మ్యూజిక్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ తదితరాలను కికాస్ ద్వారా పైరసీ చేసినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ఉక్రయిన్ జాతీయుడైన ఆర్టెమ్ వాలిన్(30) ను పోలెండ్ లోని వార్సా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్, యూఎస్ కాపీరైట్స్ కు వ్యతిరేకంగా వెబ్ సైట్లో సమాచారాన్ని ఉంచడం వంటి కేసులు ఆర్టెమ్ పై యూఎస్ అధికారులు నమోదు చేశారు. వెబ్ సైట్ ను ఉపయోగించే వినియోగదారులకు అనుకూలంగా సెర్చ్ ఆప్షన్స్ ను కికాస్ లో ఉపయోగించారని ఇది యూఎస్ కాపీరైట్స్ కు విరుద్ధంగా చేశారని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రపంచంలోనే ఎక్కువమంది వీక్షించే వెబ్ సైట్లలో కికాస్ 69వ స్థానానికి చేరిందని తెలిపింది. తరచుగా డొమైన్లను సీజ్ చేస్తుండటం, కేసుల కారణంగా వాలిన్ వివిధ దేశాలకు సర్వర్లను మార్చివేశాడని చెప్పింది. చికాగో కోర్టులో వాలిన్ పై కేసు నమోదుకావడంతో పోలెండ్ అధికారులతో చర్చలు జరిపి వాలిన్ ను అదుపులోకి తీసుకుఇన విచారించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ విభాగం భావిస్తోంది. వాలిన్ ఆపిల్ అకౌంట్ ను గుర్తించిన అమెరికా పోలీసులు కొన్నివివరాలను సేకరించారు. మొత్తం 28 భాషల్లో కికాస్ రన్ అవుతున్నట్లు గుర్తించారు. కికాస్ సంవత్సర ఆదాయం 54 మిలియన్ డాలర్లు కాగా, కేవలం యాడ్ ల ద్వారా 12.5 నుంచి 22.3 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది. బ్రిటన్, ఐర్లాండ్, ఇటలీ, డెన్మార్క్, బెల్జియం, మలేసియాలు పలుమార్లు కికాస్ ను బ్లాక్ చేయడంతో సర్వర్ డొమైన్లను వేరే దేశాలకు మార్చినట్లు గుర్తించారు. కొత్తగా విడుదలై థియేటర్లలో నడుస్తున్న కెప్టెన్ అమెరికా:సివిల్ వార్, నౌ యూ సీ మీ2, ఫైండింగ్ డోరీ తదితర చిత్రాలకు చెందిన పైరసీ ప్రింట్లు వెబ్ సైట్లో డౌన్ లోడింగ్ కు ఉండటాన్ని గుర్తించారు. 2008లో క్రిప్టోనీట్ పేరుతో కికాస్ ను వాలిన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. , కికాస్, ఆర్టెమ్ వాలిన్, అరెస్టు