కికాస్ టోరెంట్స్ వచ్చేసిందోచ్ | kickass torrents returned with new domain | Sakshi
Sakshi News home page

కికాస్ టోరెంట్స్ వచ్చేసిందోచ్

Dec 18 2016 4:25 PM | Updated on Sep 4 2017 11:03 PM

కికాస్ టోరెంట్స్ వచ్చేసిందోచ్

కికాస్ టోరెంట్స్ వచ్చేసిందోచ్

టోరెంట్ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది వినియోగించే..

టోరెంట్ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది వినియోగించే kickass.to(KAT) కొత్త డొమైన్ తో తిరిగి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఏడాది జులైలో ఈ వెబ్ సైట్‌ నిర్వహకుడిని ఆర్టెమ్ వాలిన్ ను పోలెండ్ లో అరెస్టు చేసిన అమెరికా పోలీసులు తర్వాత వెబ్ సైట్ ను పూర్తిగా మూసేశారు. దీంతో కికాస్ పేరిట పలు మిర్రర్ వెబ్ సైట్లు నెట్ లో దర్శనమిచ్చాయి. 
 
పాత కికాస్ వెబ్ సైటుకు పనిచేసిన టీం మళ్లీ ఏకమై katcr.co పేరుతో మరో కొత్త డొమైన్ ను ప్రారంభించింది. పాత కికాస్ వెబ్ సైట్ తరహాలోనే ఉన్న కొత్త సైట్లో కూడా ఇతరులతో చర్చించి టోరెంట్ ఫైళ్లు షేర్ చేసుకోవచ్చు. అయితే, వినియోగదారుల తాకిడి అధికంగా ఉండటంతో వెబ్ సైట్ తొందరగా స్పందించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement