'సీటు బెల్టు కారణంగానే...' | AirAsia crash: Rescuers find 30 bodies, focus on 5 sq km area | Sakshi
Sakshi News home page

'సీటు బెల్టు కారణంగానే...'

Jan 2 2015 8:46 PM | Updated on Oct 2 2018 7:37 PM

సముద్రంలో తేలిన మృతదేహాలు - Sakshi

సముద్రంలో తేలిన మృతదేహాలు

ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

జకార్తా: ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. శుక్రవారం 30 మృతదేహాలు వెలికి తీశారు. సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్నవారు కూర్చున్నట్టుగా మృతి చెందిన వారి ఐదు మృతదేహాలు వెలికితీసిన వాటిలో ఉన్నాయి.

ప్రతికూల వాతావరణంతో జావా సముద్రం నుంచి మృతదేహాలు వెలికితీయడం కష్టసాధ్యమవుతోంది. మరోవైపు సీటు బెల్టు కారణంగా మృతదేహాలు నీటిపైన తేలడం లేదని సహాయక సిబ్బంది తెలిపారు. సీటు బెల్టు పెట్టుకుని మృతిచెందిన వారిని వెలికి తీయడానికి కష్టపడాల్సివస్తోందని పేర్కొన్నారు.

సహాయక సిబ్బంది ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి. ముందుగా విమాన ప్రధాన శకలాన్ని కనుగొనడం, బ్లాక్ బాక్స్ లేదా ఫ్లైట్ రికార్డర్ ను గుర్తించడం. ఇండోనేసియా సురయ నుంచి సింగపూర్ వెళుతూ ఎయిర్ విమానం ఆదివారం జావా సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న 162 మంది జలసమాధి అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement