ప్రభుత్వ బ్యాంకులకు ఎన్‌పీఏ కొత్త పాలసీ కిక్‌ | 9 PSU banks hit fresh 52-week high as Cabinet approves new NPA policy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకులకు ఎన్‌పీఏ కొత్త పాలసీ కిక్‌

May 4 2017 11:02 AM | Updated on Sep 5 2017 10:24 AM

ప్రభుత్వ బ్యాంకులకు ఎన్‌పీఏ కొత్త పాలసీ కిక్‌

ప్రభుత్వ బ్యాంకులకు ఎన్‌పీఏ కొత్త పాలసీ కిక్‌

కేంద్ర ప్రభుత‍్వం బ్యాంకుల మొండి బకాయిల(ఎన్‌పిఎ) సమస్య పరిష్కారం కోసం ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించడం బ్యాంకింగ్‌ సెక్టార్లో జోష్‌ పెంచింది.

ముంబై: కేంద్ర ప్రభుత‍్వం బ్యాంకుల  మొండి బకాయిల(ఎన్‌పిఎ) సమస్య పరిష్కారం కోసం  ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించడం బ్యాంకింగ్‌   సెక్టార్లో జోష్‌ పెంచింది.  కొత్త ఎన్‌పీఏ పాలసీ అంచనాలతో దాదాపు అన్ని బ్యాంక్‌ పేర్లు లాభాల్లో  ట్రేడ్‌అవుతున్నాయి.  ముఖ‍్యంగా  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో   తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు 52 వారాల గరిష్టాన్ని నమోదు చేయడం విశేషం.  లాభాల మార్కెట్‌ లో  బ్యాంకింగ్‌ నిఫ్టీ మేజర్‌ విన్నర్‌గా నిలిచింది. మరోపక్క ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల విడుదల నేపథ్యంలో 9 శాతం జంప్‌చేసింది.  అటు  ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 22,624 పాయింట్ల వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది.

 ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్లు ఎన్ఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్ తమ 52 వారాల గరిష్ఠానికి దగ్గరగా ఉన్నాయి.

బ్యాంకింగ్ వ్యవస్థలో రూ .6 లక్షల కోట్ల విలువైన నాన్ పెర్‌ఫామింగ్‌ ఎస్సెట్స్‌  ఆస్తులు (ఎన్పిఎలు) సమస్క పరిష్కారానికి రిప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ కొత్త ప్రణాళికను ఆమోదించింది.  అయితే ఈ ఆర్డినెన్స్‌ను భారత  రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement