కారు బాంబు పేలుడు : 120 మంది మృతి! | 80 killed in Baghdad bomb attack | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!

Jul 18 2015 8:43 AM | Updated on Sep 3 2017 5:45 AM

కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!

కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!

ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భద్రత దళాలు వెల్లడించాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని... దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రత దళాలు పేర్కొన్నాయి.

ఈ బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. బాంబు పేలుడుతో ఖాన్ బని సాద్ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిందని చెప్పారు. రంజాన్ పండగ సమీపించడంతో మార్కెట్ ప్రాంతమంతా జనాలతో నిండి ఉందని తెలిపారు. మార్కెట్లోని ట్రక్లో బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement