ప్రసాదం తిని 55 మందికి అస్వస్థత | 55 fall ill after eating 'prasad' in Bihar | Sakshi
Sakshi News home page

ప్రసాదం తిని 55 మందికి అస్వస్థత

May 12 2015 1:05 PM | Updated on Oct 16 2018 8:23 PM

ప్రసాదం తిని 55 మందికి అస్వస్థత - Sakshi

ప్రసాదం తిని 55 మందికి అస్వస్థత

బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని మీనాపూర్ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని దాదాపు 55 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పాట్నా : బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని మీనాపూర్ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని దాదాపు 55 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  దాంతో వారిని ముజఫర్పూర్ నగరంలోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంగళవారం తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు మహిళలు ఉన్నారని వెల్లడించారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం ప్రసాదం తిన్న వెంటనే 55 మందికి కడుపు నొప్పి వచ్చి వాంతులయ్యాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement