20 తులాల బంగారు ఆభరణాలు చోరీ | 20 grams gold jewellery theft | Sakshi
Sakshi News home page

20 తులాల బంగారు ఆభరణాలు చోరీ

Oct 18 2015 10:23 PM | Updated on Sep 3 2017 11:10 AM

ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

నాగోలు: ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాక్‌టౌన్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంటులో గడ్డం ప్రియదర్శిని ప్రైవేటు ఉద్యోగిని. శనివారం రాత్రి ఉద్యోగానికి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్లింది.

అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement