10 పైసలకే లీటరు నీరు! | 10 paisa for liter water! | Sakshi
Sakshi News home page

10 పైసలకే లీటరు నీరు!

Jul 30 2014 6:32 PM | Updated on Sep 2 2017 11:07 AM

10 పైసలకే లీటరు నీరు!

10 పైసలకే లీటరు నీరు!

పది పైసలకు లీటరు నీరు పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు ప్రారంభించారు.

బెంగళూరు: పది పైసలకు లీటరు నీరు పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మొదలు పెట్టారు.  విధాన సౌధ బాంక్వెట్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 300 గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యూనిట్లను ఏకకాలంలో సిద్ధరామయ్య  ప్రారంభించారు.


ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఒక్కో నీటిశుద్ధి యూనిట్ను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన లాభాలలో రెండు శాతాన్ని సమాజశ్రేయస్సుకు ఖర్చు చేయవలసి ఉంటుదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement