ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. హైదరాబాద్లో జరిగిన వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశంలో పలువురు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
వచ్చేనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలతో హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఈ విషయమై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు చెప్పారు.