ప్రజాసంక్షేమం పట్టని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ | YSRCP Leader Criticize On KCR Govt | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమం పట్టని టీఆర్‌ఎస్‌ సర్కార్‌

May 12 2018 7:23 AM | Updated on May 29 2018 4:40 PM

YSRCP Leader Criticize On KCR Govt - Sakshi

మాట్లాడుతున్న గోవర్ధనశాస్త్రీ

పెద్దపల్లిరూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తుందని.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలం చేసుకుని తిరిగి అధికారం  దక్కించుకోవాలన్న ఆరాటంతో ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు గోవర్ధనశాస్త్రీ విమర్శించారు. పెద్దపల్లిలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి వారిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించిన విషయాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు.

ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామని పేర్కొంటున్నా... రైతులపై ఇప్పటికీ వడ్డీభారం అలాగే ఉందని.. బ్యాంకుల్లో ఉన్న పాసుపుస్తకాలు ఇంకా రైతుల చేతికే రాలేదన్నారు. ఇపుడు కొత్తగా దేశానికే ఆదర్శమంటూ రైతులను మభ్యపెట్టేందుకే  రైతుబంధు పేరిట ఎకరానికి రూ.4 వేలు చెల్లిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.  ఆయన వెంట నాయకులు చిలారపు సదానందం, సిద్ధార్థరెడ్డి, ప్రేంకుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement