బ్రహ్మరథం | ys sharmila paramarsha yathra | Sakshi
Sakshi News home page

బ్రహ్మరథం

Jul 3 2015 1:51 AM | Updated on May 29 2018 6:04 PM

బ్రహ్మరథం - Sakshi

బ్రహ్మరథం

తండ్రిపై చూపిన అభిమానాన్నే జిల్లా ప్రజలు ఆయన తనయపైనా కన బరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు

♦ షర్మిల భరోసా  అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..
♦ ధైర్యంగా ఉంటే పిల్లలు భయపడరు
♦ మర్పల్లిలో నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ తనయ
 
 జిల్లాలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
 తండ్రిపై చూపిన అభిమానాన్నే జిల్లా ప్రజలు ఆయన తనయపైనా కన బరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శించిన ఆయన కూతురు షర్మిలకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. నాలుగు రోజుల పర్యటనలో 15 కుటుంబాలను కలుసుకున్న షర్మిల.. వైఎస్‌ను అభిమానించే ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని మాటిచ్చారు. ఏ కష్టమొచ్చినా తనకు ఫోన్ చేయమని భరోసా ఇచ్చారు.

ఏడు నియోజకవర్గాల్లో 600 కి లోమీటర్ల మేర సాగిన యాత్రలో.. ప్రజలను ఆమె ఆత్మీయంగా పలకరించారు. కుటుంబసభ్యులను కోల్పోయి ఆవేదనతో ఉన్నవారికి సాంత్వన కలిగించేలా ధైర్యం చెప్పారు. వైఎస్ మరణించి ఆరేళ్లయినా.. తమను గుర్తుంచుకొని సాక్షాత్తూ ఆయన తనయే రావడం ఆ కుటుంబాల్లో ఎనలేని సంతోషాన్ని కలిగించింది. మారుమూల పల్లెల్లోనూ రాజన్న బిడ్డకు ఘనస్వాగతం లభించింది.
 - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని టీవీలో చూస్తూ తట్టుకోలేక మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న కమ్మరి నారాయణ కుటుంబాన్ని వైఎస్ తనయ షర్మిల గురువారం పరామర్శించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నారాయణ చిత్ర పటానికి షర్మిల పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి, వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత నారాయణ కుటుంబసభ్యులను షర్మిల పరిచయం చేసుకున్నారు. నారాయణ భార్య నీరజ, కూతురు వైష్ణవి, కుమారుడు నవదీప్‌చారి ఒక్కసారిగా కంటతడిపెట్టారు. దీంతో చలించిన షర్మిల.. ‘అధైర్యపడొద్దు... నీవు ధైర్యంగా ఉంటే పిల్లలు భయపడరు..’ అని నీరజను ఓదార్చారు. నీకు ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నామని నారాయణ కుటుంబసభ్యులకు ఆమె భరోసా ఇచ్చారు. - మర్పల్లి
 
 షర్మిల పరామర్శించిన  తీరు ఇలా సాగింది..
 షర్మిల: నీరజ బాగున్నావా? ఎంతమంది పిల్లలు ఎక్కడుంటున్నారు?
 నీరజ: బాగానే ఉన్నాను. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు
 షర్మిల: పిల్లల పేర్లు?
 నీరజ: కూతురు వైష్ణవి, కుమారుడు నవదీప్‌చారి. భర్త చనిపోయిన మూడు నెలలకు కుమారుడు పుట్టాడు.
 షర్మిల: మీ భర్త ఎట్లా చనిపోయాడు?
 నీరజ: రచ్చబండ కోసం వైఎస్ వెళుతున్న హెలికాప్టర్ కనిపించటం లేదని టీవీలో వార్తలు చూస్తూ.. రెండు రోజులపాటు టీవీ ముందే కుర్చున్నాడు. ‘వైఎస్ ఇక లేరు’ అని మరణవార్త విన్నాడు. అంతలోనే కరెంటు పో గానే ఇంట్లో నుంచి తాడు తీసుకొని వెళ్లి చెట్టు కు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
 షర్మిల: నారాయణ టీవీ చూసేటప్పుడు ఇంట్లో ఎవ్వరెవ్వరు ఉన్నారు?
 నీరజ: టీవీ చూసేటప్పుడు బావ రాములు, భర్త నారాయణ, నాయనమ్మ చెంద్రమ్మ ఉన్నా రు. మీ బావ రాములు ఉన్నాడా? పిలవండి.

 షర్మిల:  (రాములు ఇంట్లోకి రాగానే) మీరేమి పనులు చేస్తారు? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? ఏం పనులు చేస్తారు?
 రాములు: మేము నలుగురం అన్నదమ్ములం.. నేను పెద్దవాడిని.. రెండో తమ్ముడు బ్రహ్మం, మూడో తమ్ముడు మృతుడు నారాయణ, నాలుగో తమ్ముడు మోనాచారి. కమ్మరి, కార్పెంటరీ పనులు చేస్తాం.
 షర్మిల: నారాయణ ఏమి చేసేవాడు?
 రాములు: టెయిలరింగ్ పనులు చేస్తుండేవాడు.
 షర్మిల: నీవేమి చేస్తున్నావమ్మా నీరజ?
 నీరజ: భర్త చనిపోగానే కొన్నిరోజులపాటు ఇంటివద్ద ఉన్నాను. ఆ తరువాత తమ పోషణభారం కావటంతో మెదక్ జిల్లా వీఎస్‌టీ కంపెనీలో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాను.
 షర్మిల: వ్యవసాయ పొలం ఉన్నదా?
 నీరజ: నలుగురు అన్నదమ్ములకు కలిపి ఆరెకరాల పొలం ఉంది. కౌలుకు ఇచ్చాం.
 షర్మిల: మా నుంచి గతంలో ఏదైనా ఆర్థిక సహాయం అందిందా?
 నీరజ: లక్ష రూపాయలు చెక్కు అందింది. ఆ డబ్బులను పిల్లల పేరున డిపాజిట్ చేశాం. షర్మిల: మీ భర్తకు వైఎస్ అంటే ఎందుకు ఇష్టం?
 నీరజ: వైఎస్ సభలు, సమావేశాలు ఎక్కడ ఉన్నా వెళ్లేవాడు. పేదప్రజలకోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందటంతో అభిమానిగా ఉండేవాడు.
 షర్మిల: వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ విదంగా ఉంవేవి?
 జెడ్పీటీసీ సభ్యురాలు శోభరాణి: వైఎస్ అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ అభిమానం, వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక్కటి ప్రతి ఇంటింకి అందింది. 2007 ప్రజాపథంలో మర్పల్లికి వచ్చి రూ.50 లక్షలతో సీసీ రోడ్లకు ఇచ్చాడు. ఇతర పనులకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషిచేశాడు. దీంతో వైఎస్ ప్రజల గెండెల్లో నిల్చాడు.
 షర్మిల:  అమ్మ నీరజా.. ఇక వెళతాను.. ఏమై నా సమస్య ఉంటే మీకిచ్చిన నంబర్‌కు ఫోన్ చేయండి.
 నీరజ: సరే మేడం.. వెళ్లి రండి. మీరు మా కుటుంబానికి అండగా నిలిచినందుకు మీకు రుణపడి ఉంటాం.
 
 మోమిన్‌పేటలో యాదయ్య కుటుంబసభ్యులతో..
  మోమిన్‌పేట చేరుకొన్న షర్మిల యాదయ్య ఇంట్లో ఉన్న వైఎస్ చిత్రపటానికి, యాదయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యాదయ్య కుమారుడు ప్రసాద్, కూతురు ప్రమీలను పరిచయం చేసుకున్నారు.

 షర్మిల: ఎలా ఉన్నారమ్మా?
 ప్రసాద్: కష్టాల్లో ఉన్నామమ్మా..
 షర్మిల: నాన్న మృతిచెందిన తర్వాత మీ నాన్న ఎన్ని రోజులకు చనిపోయారు?
 ప్రసాద్: రాజన్న హెలికాప్టర్ కనిపించకుండా పోయాక ఆరు రోజులు టీవీ ముందే కూర్చొని దిగులుతో మంచం పట్టి కింద పడిపోయాడు. తట్టి చూస్తే అప్పటికే చనిపోయాడు.
 షర్మిల: అమ్మ ఎప్పుడు చనిపోయింది?
 ప్రసాద్: నాన్న కంటే ఒక ఏడాది ముందే..
 షర్మిల:  ఈయన ఎవరు?
 (పక్కనున్న చిత్రపటాన్ని చూపుతూ..)
 ప్రసాద్:  మా అన్నయ్య.
 షర్మిల:  ఎలా? ఎప్పుడు చనిపోయాడు?
 ప్రసాద్: ఆరు నెలల క్రితం చనిపోయాడు.
 షర్మిల: మీరు ఇద్దరే ఉన్నారా?
 ప్రసాద్: అవునమ్మా. మా చెల్లికి పెళ్లి అయింది.. కానీ విడాకులు ఇచ్చాడు.
 షర్మిల: ఇద్దరు ఇష్టంతోనే చేసుకొన్నారా?
 ప్రమీల: అవునమ్మా..  
 షర్మిల:  వారితో మాట్లాడి నేను న్యాయం జరి గేలా చూస్తా.. ఇక్కడ ఎవరు పెద్దమనిషి?
 హబీబ్ సలాం (పార్టీ నాయకుడు): అబ్బాయివారితో మాట్లాడి న్యాయం చేస్తా.  
 ప్రమీల: మాకు ఎవరు లేరమ్మా.. మాకు ఎదైన దారి చూపాలమ్మా..
 షర్మిల:  ఎక్కడైనా పనిచేస్తారా..?
 ప్రమీల: సరేనమ్మా..
 షర్మిల:  ఎంతవరకు చదువుకున్నారు?
 ప్రసాద్: ఏడో తరగతి వరకు.. చెల్లి పదో తరగతి వరకు చదివావమ్మా..
 షర్మిల: దేవుడున్నాడు.. తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఈ నంబరుకు ఫోన్ చేసి రండి.
 
 మీ వెంట మేమున్నాం..
  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను షర్మిల గురువారం పరామర్శించారు. మేమున్నామంటూ మోమిన్‌పేటలోని యాదయ్య కుటుంబసభ్యులను, ఎన్కతలలోని వెంకటేశ ం కుటుంబానికి భరోసా కల్పించారు. మండలంలో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు, అభిమానులు పార్టీలకతీతంగా దారి పొడవునా నీరాజనం పలికారు.
 - మోమిన్‌పేట
 
 ఎన్కతలలో అలంపల్లి వెంకటేశం కుటుంబసభ్యులతో..
 మోమిన్‌పేట నుంచి నేరుగా ఎన్కతలలోని అలంపల్లి వెంకటేశం ఇంటికి వచ్చిన షర్మిల వెంకటేశం, వైఎస్ చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వెంకటేశం భార్య సంగమ్మ, కూతురు కృష్ణవేణి, కుమారుడు మహేందర్‌లను పరిచయం చేసుకొన్నారు. వెంటనే వారు ఏడవడంతో షర్మిల ‘నాకు నాన్న లేరు.. నీకు నాన్నా లేరు’ అధైర్య పడవద్దు, ధైర్యంగా ఉండాలి. నీకు ఫీజు కట్టేందుకు డబ్బులు లేకున్నా నేనిస్తానని ధైర్యం చెప్పారు. అప్యాయంగా ముద్దాడి ధ్యైరం చెప్పి ఓదార్చారు.

 షర్మిల: ఏమమ్మా బాగున్నారా?
 సంగమ్మ: బాగున్నాం అమ్మా.
 షర్మిల: మీ ఆయన ఏం పనిచేసేవాడు?
 సంగమ్మ: ఉన్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్ సారు పాదయా త్ర చేసినప్పుడు రోజంతా ఆయన వెంటే ఉన్నాడు. బాగా అభిమానించేవాడు. టీవీలో సారు చనిపోయినట్లు తెలుసుకొన్న వెంటనే ఛాతిలో నొ ప్పంటూ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళుతుంటే చనిపోయాడు.
 షర్మిల: నీవు ఎం చదువుకుంటున్నావు (కూతురు కృష్ణవేణిని ఉద్దేశించి..)
 కృష్ణవేణి: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రైవే టు కాలేటీలో చదువుతున్నాను.
 షర్మిల: బాగా చదువుకో ఫీజుకు డబ్బులు లేకుంటే నాకు ఫోన్ చెయ్యి.
 కృష్ణవేణి: నాన్న లేరని బాధేస్తుందమ్మా..
 షర్మిల: అందరి ముందు తలెత్తుకునేలా బాగా చదువుకోవాలి. నాకు నాన్న లేరు.. నీకు నాన్న లేరు.. బాధపడొద్దు.
 షర్మిల: నీవు ఏం చదువుతున్నావు?
 (కొడుకు మహేందర్‌ను ఉద్దేశించి..)
 మహేందర్: ఆరో తరగతి చదువుతున్నాను.
 షర్మిల: నాన్న ఎలా చనిపోయాడు?
 మహేందర్: నాకు తెలియదు.. చిన్నగా ఉన్నా.
 షర్మిల: దేవుడున్నాడు, ధ్యైరంగా ఉండండి..
 
 ఆరోగ్యశ్రీతోనే... పునర్జన్మ
 తాండూరు రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు పునర్జన్మ వచ్చిందని మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన పందుగొట్టె బాలప్ప, వైఎస్ తనయ షర్మిలతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాండూరు పట్టణం నుంచి గురువారం ప్రారంభమైన పరామర్శ యాత్ర తాండూరు మండలం జినుగుర్తి గ్రామం మీదుగా పెద్దేముల్ మండలానికి వెళుతోంది. జినుగుర్తి గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందిన బాలప్ప తన ఇం టివద్ద వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. పరామర్శలో భాగంగా బస్సులో నుంచి వెళుతున్న షర్మిల, బాలప్ప ఇంటివద్ద ఆగి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసింది.

ఈ సందర్భంగా షర్మిల మట్లాడుతూ... వైఎస్ అభిమానులు అధైర్యపడొద్దని, వారికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందన్నారు. వెంటనే అక్కడే ఉన్న బాలప్ప నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకున్నానని షర్మిలకు వివరించారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతోనే నాకు పునర్జన్మ వచ్చిందని ఆమెతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలు షర్మిలను శాలువాతో సన్మానించారు. అనంతరం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం నాయకులు చెన్నప్ప, రాములు షర్మిలకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వైఎస్ అభిమానులు బోయిని కన్నప్ప, కమ్మరి కిషన్, శంకరయ్య, అనంతయ్య, అంజిలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement