కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. సిరిసిల్ల మండలం చీర్లవంచలో లచ్చవ్వ కుటుంబాన్ని ఆమె శనివారం పరామర్శించి...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. సిరిసిల్ల మండలం చీర్లవంచలో లచ్చవ్వ కుటుంబాన్ని ఆమె శనివారం పరామర్శించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. దీంతో జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేటితో ముగిసింది. మహానేత మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. జిల్లావ్యాప్తంగా రెండువిడతల్లో 13 నియోజకవర్గాల్లో 900 కిలోమీటర్లు పర్యటించారు.