ఇంటర్‌నెట్‌.. కనికట్టు

youth addicted to cell phones and internet - Sakshi

పెడదోవ పడుతున్న యువత

పెంచికల్‌పేట్‌ : చేతిలో సెల్‌ ఫోన్‌ ఉండి దానిలో డాటా ఉంటే చాలు పక్కన నుంచి వెళ్లేవారు ఎవరు పిలిచిన పలికే వారు లేరు.యువత చేతిలో సెల్‌ఫోన్‌ మంచికి ఉపయోగించాల్సి ఉండగా సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేసుకుంటున్నారు.ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన సెల్‌ఫోన్‌ వినియోగం నేడు గ్రామాల్లోకి విస్తరించింది.ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చిన్నారులు, యువత, విద్యార్థులు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లతోనే మమేకం అవుతున్నారు.ఒక విధంగా చెప్పాలంటే సెల్‌ఫోన్‌ మనిషి శరీరంలో ఒక భాగం అయింది.అవసరాలకు వినియోగించాల్సిన సెల్‌ఫోన్‌ అదేపనిగా వాడుతూ బానిసలవుతున్నారు.

యువత చిత్తు..
పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు సెల్‌ఫోన్‌ లేని వారు లేరు.ఇంటర్‌నెట్‌ను కేవలం మంచి పనులకు ఉపయోగించాల్సిన యువత లేచి మొదలు ఫేస్‌బుక్, వాట్సప్, ఆన్‌లైన్‌గేమ్‌లకు వినియోగిస్తూ విలువైన సమయాన్ని వృథాచేస్తున్నారు.చదువుకోవాల్సిన వయస్సులో యువత ఇంటర్‌నెట్‌లో మునిగిపోవడంతో యువత పెడదోవపడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళణ చెందుతున్నారు.

మార్కెట్‌లో చౌకధరల ఫోన్‌లు..
మార్కెట్‌లో అతితక్కువ ధరలకే ఆధునికి పరిజ్ఞానంతో నూతన ఆండ్రాయిడ్‌ వర్షన్‌లతో రోజుకో మొబైల్‌ మార్కెట్‌లోకి వస్తుండటంతో పాటు అతి తక్కువ ధరలకే కంపెనీలు డాటాను అందిస్తుండటంతో వినియోగించే వారి సంఖ్య పెరుగుతుంది.సోషల్‌ మీడియా వినియోగం పెరిగిపోయింది.దీంతో పగలు రాత్రి తేడా
లేకుండా యువత విద్యార్థులు   సందేశాలను పంపుతున్నారు.

విద్యార్థులకు దూరంగా..
మార్చి నెల అనగానే పది,ఇంటర్మీడియట్,డిగ్రీ,విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయం దీంతో మార్చి నెలలో జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిధ్దం అవుతున్నారు.సెల్‌ఫోన్‌ వినియోగించేవిద్యార్థులు వారి విలువైన స మయం వృథా కావడమే కాకుం డా ఒత్తిడికి లోనవుతున్నారు.విద్యార్థుల విలువైన సమయం వృథా అవడమే కాకుండా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

ఇబ్బందులు తప్పవు
సెల్‌ఫోన్‌ వినియోగం వలన ఎన్ని ప్ర యోజనాలు ఉన్నాయో అందరికి తెలు సు కానీ సెల్‌ఫోన్‌ జాగ్రత్తగా వినియోగించకపోతే అంతకంటే ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంటర్‌నెట్‌ను మంచి కొరకు ఉపయోగించాల్సి ఉండగా అనవసరంగా వాడుతుండటంతో కేసుల్లో ఇరుకుతున్న యువత పెరిగిపోతున్నారు.యువతను కాస్తా కనిపెట్టి ఉండాలి లేక పోతే ప్రమాధాలను కొనితెచ్చుకునే అవకాశం ఉంది.                        – ప్రభాకర్,ఎస్సై పెంచికల్‌పేట్‌

సెల్‌ఫోన్‌ వినియోగంతో..
పరీక్ష సమయంలో యువత సెల్‌ఫోన్‌తో ఎక్కువ వినియోగించడం వలన యువత ఒత్తిడికి లోనవడమే కాకుండా కంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సెల్‌ఫోన్‌తో మమేకం కావడం వలన ఏకాగ్రత దెబ్బతినండంతో కంటి చూపు దెబ్బతింటుంది.పరీక్ష సమయంలో యువత సెల్‌ఫోన్‌ దూరంగా ఉంచితేనే మంచిది.
– డాక్టర్‌ రాజు, పీహెచ్‌సీ వైద్యుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top