
యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడనే ఆవేదనతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా కాలువశ్రీరాంపూర్ కూనాంలో చోటుచేసుకుంది.
కరీంనగర్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడనే ఆవేదనతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా కాలువశ్రీరాంపూర్ కూనాంలో చోటుచేసుకుంది. ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
యువతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యువతి ఆత్మహత్యకు కారణమైన ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.