కేక... ఈ కోక | Wonderful saree creation by hariprasad | Sakshi
Sakshi News home page

కేక... ఈ కోక

May 25 2018 1:08 AM | Updated on May 25 2018 1:08 AM

Wonderful saree creation by hariprasad - Sakshi

సిరిసిల్ల: సూది రంధ్రంలో దూరే చీరను తయారు చేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పా డు మరమగ్గాల కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌(34). స్థానిక నెహ్రూనగర్‌కు చెందిన హరిప్రసాద్‌ పవర్‌లూమ్‌పై మూడు నెలల పాటు శ్రమించి అతి సూక్ష్మమైన దారం పోగులతో సూదిలో దూరిపోయే సన్నని చీరను తయారు చేశాడు. 6.50 మీటర్ల పొడవున్న సిల్క్‌చీరను 50 గ్రాముల బరువుతో నేశాడు. సునాయాసంగా చీరసూదిలో నుంచి దూరిపోతుంది.

గతంలో ఉంగరంలో దూరేచీరను 6.50 మీటర్ల పొడవు, 450 గ్రాముల బరువుతో పట్టు చీరను పవర్‌లూమ్‌పై నేసి రికార్డు సృష్టించాడు. మరో ప్రయత్నంగా సిల్క్, మోనోబ్రైట్‌ పోగులతో చీరను మరమగ్గంపై నేశాడు. తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. వెంట్రుక అంతటి సూక్ష్మదనంతో ఉండే పోగులను జాగ్రత్తగా పొందుపరిచి 6.50 మీటర్ల పొడవైన చీరను తయారు చేశారు.

పదోతరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్‌.. మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2014లో బుల్లిమగ్గం, వార్పిన్, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. వీఐపీలకు గిఫ్ట్‌లను సైతం హరిప్రసాద్‌ తయారు చేసి ఇస్తారు. హరిప్రసాద్‌ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement