ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం డొల్లార గ్రామ సమీపంలోని పెన్‌గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది.
జైనత్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం డొల్లార గ్రామ సమీపంలోని పెన్‌గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారు మహిళ 40 సంవత్సరాల వరకు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.