సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
Jul 3 2017 1:14 PM | Updated on Sep 5 2017 3:06 PM
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. భూ వివాదం విషయంలో హుజూర్‌నగర్ కోర్టుకు వెళ్తే అక్కడ అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. సహాయం చేస్తానని చెప్పి లైంగింక వేధింపులకు గురిచేస్తున్నాడని దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె తెలిపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement