ఎస్పీ ఆఫీసు ముందు మహిళ ధర్నా | Woman stages dharna in front of SP office | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఆఫీసు ముందు మహిళ ధర్నా

Sep 29 2015 2:25 PM | Updated on Sep 3 2017 10:11 AM

జిల్లాలోని ఎస్పీ ఆఫీసు ముందు ప్రేమలత(35) అనే మహిళ మంగళవారం ధర్నాకు దిగింది. వరంగల్ జిల్లా మానకొండూరులో 6 నెలల ముందు ఎస్‌ఐగా పనిచేసిన రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేసింది.

కరీంనగర్ : జిల్లాలోని ఎస్పీ ఆఫీసు ముందు ప్రేమలత(35) అనే మహిళ మంగళవారం ధర్నాకు దిగింది. వరంగల్ జిల్లా మానకొండూరులో 6 నెలల ముందు ఎస్‌ఐగా పనిచేసిన రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేసింది. అక్కడికి చేరుకున్న ఎస్పీ.. చట్టప్రకారమే ఇంతకుముందు అతనిపై చర్యలు తీసుకున్నామని, చట్టానికి మించి తామేమీ చేయలేమని ఆమెకు తెలిపారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు.

2014 లో ప్రేమలతను అప్పటి మానకొండూరు ఎస్‌ఐ రాజు వేధించటంతో ఎస్‌ఐను 6 నెలలు సస్పెండ్ చేశారు. ఆరు నెలల తర్వాత మళ్లీ రీపోస్టింగ్ ఇవ్వడంతో మళ్లీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోలేమని ఎస్పీ ఆమెకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement