కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం)లో చోటుచేసుకుంది. మండలంలోని నాంచారిపేటకు చెందిన పోతగాని అరుణ(32) మంగళవారం అర్థరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుధవారం ఉదయం మృతి చెందింది. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో ఆమె మనస్తాపం చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగప్రసాద్ తెలిపారు.