భర్తపై భార్య గొడ్డలితో దాడి | Wife attacks axe not bare of husband harrassments | Sakshi
Sakshi News home page

భర్తపై భార్య గొడ్డలితో దాడి

Jun 3 2015 10:23 PM | Updated on Sep 3 2017 3:10 AM

భర్తపై భార్య గొడ్డలితో దాడి

భర్తపై భార్య గొడ్డలితో దాడి

భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక ఓ భార్య తిరగబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది.

సత్తుపల్లి (ఖమ్మం): భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక ఓ భార్య తిరగబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగారం 15వ గిరిజన బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొమరం నరేష్ మద్యం తాగి వచ్చి నిత్యం భార్య శ్రావ్యను చితకొట్టేవాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యను కొట్టి మద్యం సేవించి మళ్లీ ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో నిద్రపోతున్న మూడేళ్ల కుమార్తెపై చేయిచేసుకుంటుండగా శ్రావ్య అడ్డుపడింది. దీంతో ఆమెను కూడా కొట్టడంతో ఒక మూలన పడిపోయింది. అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నరేష్‌పై దాడి చేసింది. మెడ, ఛాతి, చేయిపై తీవ్ర గాయాలపాలైన నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల వారు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 2009లో కొమరం నరేష్‌కు శ్రావ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement