సీనియారిటీ జాబితా ఏది? | What is the seniority list? | Sakshi
Sakshi News home page

సీనియారిటీ జాబితా ఏది?

Jun 22 2015 1:03 AM | Updated on May 24 2018 1:57 PM

రవాణా శాఖలో మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లకు ప్రాంతీయ రవాణా అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు...

రవాణా శాఖలో డీపీసీ హడావుడి భేటీపై సిబ్బంది ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లకు ప్రాంతీయ రవాణా అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు సోమవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) భేటీ కానుంది. అయితే దీనికి సంబంధించి కొత్తగా సీనియారిటీ జాబితా రూపొందించకుండానే హడావుడిగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆ విభాగం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో రెండేళ్ల కింద రూపొందించిన జాబితా ప్రామాణికంగా పదోన్నతులు ఇస్తే పదోన్నతులు పొందే వీలున్న పలువురికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా సీనియారిటీ జాబితా రూపొందించిన తర్వాతే పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement