సభ నిర్వహించి తీరుతాం : కోదండరాం | we will conduct public meeting in nizamabad: kodandaram | Sakshi
Sakshi News home page

సభ నిర్వహించి తీరుతాం : కోదండరాం

Aug 11 2017 7:58 PM | Updated on Jul 29 2019 2:51 PM

సభ నిర్వహించి తీరుతాం : కోదండరాం - Sakshi

సభ నిర్వహించి తీరుతాం : కోదండరాం

తమ ర్యాలీని అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.

హైదరాబాద్‌: తమ ర్యాలీని అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజలకోసమే తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని గుర్తు చేశారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకుంటే మంచిదని హితవు పలికారు. శనివారం కచ్చితంగా నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుకదందా నడుస్తోందని మండిపడ్డారు. నేరేళ్ల ఘటనలో ఒక్క ఎస్సైని సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. డీజీకి ఇచ్చి రిపోర్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

నేరెళ్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్‌
నేరేళ్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా మండిపడింది. తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement