నీరందక.. పంట దక్కక!

water scarcity Results In Crop Loss - Sakshi

అడుగంటిన భూగర్భజలం 

వట్టిపోతున్న వ్యవసాయ బోర్లు  

సాక్షి, బొంరాస్‌పేట: వ్యవసాయ బోర్లలో రోజురోజుకు నీరింకిపోవడంతో సాగులో ఉన్న వరిపంట నిలువునా ఎండిపోతోంది. రైతులు లబోదిబోమంటున్నారు. పొట్టదశలో నీరులేక వరిపంట ఎండిపోతుండటంతో తిండిగింజలు, పశుగ్రాసం కరువయ్యే పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో 14 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో ప్రతిఏటా రబీలో వరిపంట 12 వందల హెక్టార్లలో పంట సాగవుతుంది. గత వర్షాకాలంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు సాధారణ వర్షపాతం 525 మిల్లీ మీటర్లకుగానూ 291.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
24 గంటల కరెంటుకు ఆశపడిన రైతులుఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ప్రస్తుతం భూగర్భజలం తగ్గిపోయి మధ్యంతరంగా వరిపంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మండల పరిధిలోని వడిచర్ల, బురాన్‌పూర్, చౌదర్‌పల్లి గ్రామాల్లో పెద్దమొత్తంలో బోర్లు నీరులేక ఇంతకింతకు అడుగంటి పంటలు నష్టమవుతున్నాయి. మరో వారంరోజుల్లో మరింత ఎక్కువగా పంటనష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

పంట నష్టానికి కారణాలు.. 
సాధారణ వర్షపాతానికి 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదు కావడం. 
 24 గంటల కరెంటుపై ఆశలు పెంచుకొని రెండంతలు సాగుచేయడం. 
అవసరానికి మించి సాగునీరు వాడటం. (300 –500 మి.మీ. వరకు ఆరుతడి పంటలకు సరిపోతుంది. కాగా ఇక్కడి రైతులకు వరి తప్ప మిగతా పంటలు పండించని అలవాటు ఉంది. వరిలో కరిగెటకు,
పంటలో మొక్కకు 1200 మి.మీ. వరికి అవసరమున్నా 1400 మి.మీ. వరకు సాగునీరు అవసరమవుతుంది.) 
రైతులకు వ్యవసాయశాఖ వారు అవగాహన కల్పించకపోవడం. 
ఎక్కువ సాగునీరు వరి బదులు రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు చైతన్యం, ప్రచారం చేపట్టకపోవడం. 
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top