ర్యాంపులకు నిధులేవి.. | Voting Facilities To Physically Challenged Persons In Nelakondapally | Sakshi
Sakshi News home page

ర్యాంపులకు నిధులేవి..

Nov 22 2018 2:44 PM | Updated on Nov 22 2018 2:44 PM

Voting Facilities To Physically Challenged Persons In Nelakondapally - Sakshi

కొత్తకొత్తూరు పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాంపు , దివ్యాంగులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్‌)

సాక్షి, నేలకొండపల్లి: ఓటు హక్కు కలిగిన ప్రతీ దివ్యాంగుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు లను ఏర్పాటు చేస్తున్నారు. వీల్‌చైర్లలో తీసుకొచ్చి, తీసుకెళ్లటానికి రవాణా సౌకర్యం కల్పించనున్నది. డీజెబుల్‌ ఫ్రెండ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అయితే ర్యాంపుల ఏర్పాటుకు నిధుల కొరత వెం టాడుతోంది. పంచాయతీల్లో నిధులు లేక అందినకాడికాల్లా అప్పులు తెచ్చి ర్యాంపులు నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 28,553 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో 5630 మంది, మధిర 6055 మంది, వైరా 4679, సత్తుపల్లిలో 5289 మంది, పాలేరులో 6900 మంది ఉన్నారు. వీరిలో నడవలేని వారు, చెవిటి వారు, మాట రాని వారిని గుర్తించారు. అటువంటి వారి ని ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు, ఓటేసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం నుంచి ఇంటి వరకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వీల్‌ చైర్లను వికలాంగుల సంక్షేమ శాఖ, వైద్యారోగ్యశాఖల నుంచి సేకరిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేశాక ఇంటికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్‌ లేకుండా ఓటు వేసేందుకు ప్రత్యేక వసతులు, పోలింగ్‌ కేంద్రానికి రాకపోకలు సులువుగా ఉండేలా వీల్‌చైర్లను సిద్ధం చేసింది. అంధ ఓటర్లు ఎన్నికల గుర్తును గుర్తించేందుకు బ్రెయిలీ సహాయకులు, వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు.   

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ర్యాంపుల ఏర్పాటు 

కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ నిధులు వినియోగించి నిర్మించాలి. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిధు లు రాగానే అందించే ఏర్పాట్లు చేస్తారు. ముందు గా దివ్యాంగుల ప్రయోజనాల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి.
–బి.రవికుమార్,ఎంపీడీఓ, నేలకొండపల్లి 

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం  

దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పోలింగ్‌ కేం ద్రాల్లో ర్యాంపులు, వీల్‌చైర్లు అందుబాటులోకి తెస్తున్నాం. వీటిన్నంటిని జిల్లా నోడల్‌ అధికారి ఏర్పాట్లు చేస్తారు. అయితే అన్ని మండలాల ఎంపీడీఓ ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా వీల్‌చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తారు.దివ్యాంగులు ఇంటి నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా వాహనాలు సమకూరుస్తున్నాం. 
–దశరథ్, పాలేరు రిటర్నింగ్‌ అధికారి  

వసతులు కల్పించాలి 

దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించు కునేలా ఎన్నిల సంఘం చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవి ఆచరణలో చూపా లి. ఓటుకు కోసం ఎలా తీసుకెళ్లాతారో అలాగే ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల దివ్యాంగులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
–బట్టపోతుల ప్రకాషం, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి, నేలకొండపల్లి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement