సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా | vote for congress for the development | Sakshi
Sakshi News home page

సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా

Apr 14 2014 4:38 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా - Sakshi

సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా

యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెవిలో తాను జోరిగలా మారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

 అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి
 నా వల్లే తెలంగాణలో భద్రాది రాముడు  కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి

 
మాగనూర్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్‌పర్సన్, కాం గ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెవిలో తాను జోరిగలా మారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాగనూరు మండలంలోని టైరోడ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని, మాట్లాడారు. తనకు మాగనూరు మండలం పై ప్రత్యేక అభిమానం ఉందని, అం దుకే ఎన్నికల ప్రచారాన్ని ఈ మండ లం నుంచి ప్రారంభిస్తున్నాని చెప్పా రు.
 
తాను జనతా పార్టీలో ఉండి జోడెద్దుల గుర్తుపై పోటీ చేసి గెలుపొందానని, అప్పుడు ఓట్లు వేసి తనను గెలి పించిన వారు కూడా ప్రస్తుతం ఈ సభ లో ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. తాను 45ఏళ్లుగా రాజకీయం లో ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వరుస గా నాలుగు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గా, సుదీర్ఘ కాలం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి సేవ చేశానని చెప్పారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎ స్సార్ చెప్పినందుకే సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే ఈ రోజు భద్రాది రాముడు తెలంగాణ ఉన్నాడని తెలిపారు.
 
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, పేదలకు అవసరమయ్యే జాతీయ ఉపాధి హా మీ పథకం, రూపాయికి కిలో బి య్యం, ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ, 108, 104 సేవలు, తదితర పథకాలను తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకు తనను పార్లమెంట్‌కు, మక్తల్ నుంచి అసెంబ్లీకి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పంపించాలన్నారు.
 
తన రాజకీయ జీవితంలో చివరిసారిగా పోటీ చేస్తున్నానని, అందుకే మహబూబ్‌నగర్‌లో బరిలో దిగినట్లు చెప్పారు. తాను ఢిల్లీలో పోటీ చేసినా గెలుస్తానని, కానీ సొంత జిల్లా కావడంతో ఇ క్కడి నుంచే పోటీ చేయాలనుకున్నాని తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చిట్టెం సుచరిత, రాజుల అశిరెడ్డి, బసిరెడ్డి, విరాఠ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజప్పగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement