‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ | Village Panchayat Workers Protest In Mahabubnagar | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’

Jul 25 2018 1:01 PM | Updated on Oct 8 2018 5:07 PM

Village Panchayat Workers Protest In Mahabubnagar - Sakshi

నాగర్‌కర్నూల్‌: ధర్నాలో మాట్లాడుతున్న రాజ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌రూరల్‌: గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌ శ్రీనివాసులు డిమాం డ్‌ చేశారు. మంగళవారం పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది కార్మికులు, కారోబార్లు, ఎలక్ట్రిషియన్లు, స్వీపర్లు, కామటి తదితరు లకు కనీస వేతనం కల్పించా లని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి రామయ్య, పంచాయతీ కార్మికుల కృష్ణయ్య, చంద్రయ్య, నాగయ్య, స్వామి పాల్గొన్నారు.

 బిజినేపల్లిరూరల్‌: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జి ల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్‌ అన్నారు. మంగళవారం బిజినేపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికులతో చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నెలానెలా సబ్బు, నూనె అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీ ను, శుభాకర్, చంద్రమౌళి, కృష్ణాజీ, కార్మికులు వెంకటేష్, కతాల్, కృష్ణయ్య, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు.
 
సీపీఐ, కాంగ్రెస్‌ మద్దతు 
తెలకపల్లి: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శిబిరంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, సీపీఐ మండల కార్యదర్శి గోపాస్‌ లక్ష్మణ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రవికుమార్, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్, సాయిలు, వడ్డె రాములు, గోపాస్‌ లక్ష్మణ్, సుధాకర్, రషీద్, రాములు, ఉస్సేన్, మశమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ, రామస్వామి నాగయ్య, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాడూరు: కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీకి వినతి పత్రం అందించారు. వేతనం రూ. 15వేలు ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం స్పందించి  కార్మికులకు వేతనాలు పెంచి రెగ్యూలర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు వెంకటయ్య, బంగారయ్య, అన్వర్‌ తదితరులున్నారు.
 
రెండో రోజుకు చేరిన వీఓఏల ధర్నా 
నాగర్‌కర్నూల్‌రూరల్‌: జిల్లాలో పనిచేస్తున్న వీఓఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐకేపీ వీఓఏల రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18వేల వీఓఏలు ఏళ్ల తరబడి మహిళా సంఘాలకు వెట్టి చాకిరీ చేస్తే 2010లో నిర్వహించిన పోరాట ఫలితంగా రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని, దీంతో తమ కుటుంబాలను వెళ్లదీయలేకపోతున్నామని ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జడ్చర్ల సభలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తామని పేర్కొన్నారని, కానీ రూ.5వేల వేతనం ఇస్తామని చెప్పి హామీని అమలు చేయలేదని ఆరోపించారు. జెడ్పీటీసీ కొండా మణెమ్మ వారికి మద్దతు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుమలత, బాలీశ్వర్, వెంకటయ్య, జగన్, యాదగిరి, రామస్వామి, భగత్‌సింగ్, భాగ్య, నర్సింహ, జీ లేఖ తదితరులు పాల్గొన్నారు.

1
1/1

బిజినేపల్లి రూరల్‌: సమ్మెలో మాట్లాడుతున్న  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement