పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు.
సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్‌సెట్‌లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు.