
తెలంగాణ సర్వేపై కేంద్రం ఆరా తీయలేదు
ఇంటింటి సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఆరాతీసిందన్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్: ఇంటింటి సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసిందన్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం కోరలేదని తెలిపాయి. ఈ నెల19న సమగ్ర సర్వే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. తెలంగాణ సర్కారు నిర్వహించనున్న సర్వేపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
ఈ సర్వే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బుధవారం టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు సమచారం. ఎంపీల ఫిర్యాదుకు మేరకు సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్టు వార్తలు వచ్చాయి.
అయితే తెలంగాణ సర్వేపై హోంమంత్రికి ఫిర్యాదు చేయలేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి తెలిపారు. సర్వే రాజ్యాంగబద్దమా, కాదా అనే వివరణ మాత్రమే కోరామని చెప్పారు. సర్వే తప్పా, ఒప్పా అనేది తెలంగాణ ప్రజలకు తేల్చుకోవాలన్నారు.