వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామ శివారులోని శంభుని కుంటలో శనివారం సాయంత్రం గోసుల వికాస్(11), భాషికాల విష్ణు(11) అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే.
వరంగల్ (నెక్కొండ) : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామ శివారులోని శంభుని కుంటలో శనివారం సాయంత్రం గోసుల వికాస్(11), భాషికాల విష్ణు(11) అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. నిన్నంతా పోలీసులు, గ్రామస్తులు వెతికినా వారు కనపడకపోవడంతో రాత్రికి గాలింపు చర్యలు ఆపేశారు. కాగా ఆదివారం ఉదయం వారి మృతదేహాలు బయటపడటంతో వెలికి తీశారు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.
ఇద్దరూ కూడా మండలకేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. శనివారం శ్రీకృష్ణజన్మాష్ఠమి కావటంతో సరదాగా ఈతకొడదామని స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈతకెళ్లిన వీరిద్దరూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.