తెలంగాణలో స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 34 మంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందగా, మంగళవారం యూసుఫ్‌గూడకు చెందిన శోభారాణి(60),మెదక్ జిల్లా పటాన్‌చెరుకు చెందిన దండు శంకర్ (42) గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 34 మంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందగా, మంగళవారం యూసుఫ్‌గూడకు చెందిన శోభారాణి(60),మెదక్ జిల్లా పటాన్‌చెరుకు చెందిన దండు శంకర్ (42) గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. గాంధీ ఆస్పత్రిలో 37 మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 15 మంది చిన్నారులే. మొత్తమ్మీద హైదారబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో 158 మంది అనుమానిత లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, సనత్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కూడా స్వైన్ ప్లూ బారినపడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని బాలాజీనగర్‌కు చెందిన సుదీంద్ర(05)కు స్వైన్‌ఫ్లూ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన దేవమ్మకు స్వైన్‌ఫ్లూ సోకడంతో వరంగల్ ఏజీఎంలో చేరింది.
పోస్టుమార్టానికి నిరాకరణ: స్వైన్‌ఫ్లూతో మరణించిన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం సత్తివెంకటంపల్లి గ్రామానికి చెందిన ముక్కమల్ల అల్లిపెరెట్(30) మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు నిరాకరించారు. స్వైన్‌ఫ్లూ, ఎయిడ్స్ వంటి రోగాలతో మరణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేయబోమన్నారు.