వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం పులుమామిడి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వికారాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం పులుమామిడి గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్(55) ఓ శుభకార్యం నిమిత్తం వికారబాద్‌కు వచ్చి తిరిగి కారులో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్‌తో పాటు శంకర్‌పల్లి మండలానికి చెందిన నవాబ్‌రెడ్డి(45) మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.