పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, తప్పిన ప్రమాదం | Two injured by turn of petrol tanker at Janagon cross road | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, తప్పిన ప్రమాదం

Mar 29 2015 5:19 PM | Updated on Sep 2 2017 11:33 PM

నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జనగామ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది.

నల్లగొండ( సూర్యాపేట): నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జనగామ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందస్తుగా సంఘటనా స్థలికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.

గాయాలపాలైన వారిద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా,   పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీసుకోవడానికి స్థానికులు బారులు తీరినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement