
చిన్నారుల మృతదేహాల వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లులు
ఖమ్మం జిల్లా కొండంగులబోడు గ్రామంలో నీటి గుంతలోపడి సునీత (9), అంజలి (8) అనే ఇద్దరు బాలికలు మృతిచెందారు.
టేకులపల్లి (ఖమ్మం జిల్లా): టేకులపల్లి మండలం కొండంగులబోడు గ్రామంలో నీటి గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో సునీత (9), అంజలి (8) అనే ఇద్దరు బాలికలు మృతిచెందారు.
పిల్లలిద్దరూ ఆడుకుంటూ..ఆడుకుంటూ పొలంలో ఉన్న నీటిగుంతలో పడిపోయారు. పక్కనే ఎవరూ లేకపోవటంతో కొద్దిసేపటికి ఊపిరివదిలారు. విగతజీవులైన చిన్నారుల్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.