కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత | Two Children Died With Suffocation In The Car In Nizamabad | Sakshi
Sakshi News home page

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

Jul 24 2019 8:27 AM | Updated on Jul 24 2019 10:15 AM

Two Children Died With Suffocation In The Car In Nizamabad - Sakshi

కారులో రియాజ్‌, మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ మృత దేహాలు

మంగళవారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు బాలురు కారులో శవాలై తేలారు.

సాక్షి, నిజామాబాద్‌ : నగరంలోని ముజాహిద్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు బాలురు ఓ కారులో శవాలై తేలారు. వివరాలు.. రియాజ్‌ (10), మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ (5) కాలనీకి ఆడుకూంటూ వెళ్లి.. అక్కడికి కొంత దూరంలో పార్క్‌ చేసి ఉన్న కారులో ఎక్కి కూర్చున్నారు. దీన్ని ఎవరూ గమనించలేదు. కారులో చాలాసేపు ఆడుకున్నారు. అయితే, ఒక్కసారిగా కారు డోర్లు లాక్‌ అయ్యాయి. అప్పటికే కారు అద్దాలన్నీ మూసి ఉండటంతో ఊపిరి అందక వారు మృత్యువాత పడ్డారు. 

పిల్లల జాడకోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. బుధవారం ఉదయం కాలనీకి దూరంలోని ఓ కారులో ఇద్దరూ చనిపోయి కనిపించారు. డోర్లు తెరుచుకోకపోవడంతోనే పిల్లలిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement