‘కరెంట్‌’ కొలువులు

TSSPDCL Release Notification For Junior Linemans - Sakshi

3,025 పోస్టుల భర్తీకి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రకటన

2,500 జూనియర్‌ లైన్‌మెన్, 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ 

500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఆపరేటర్‌ పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 2,500 జూనియర్‌ లైన్‌మెన్, 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. సంస్థ వెబ్‌సైట్లు https://www.tssouthernpower.com  లేదా https:// tssouthernpower.cgg.gov.inలో ఈ నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని చేపట్టింది. జిల్లా, రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను  నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

అర్హత వివరాలు..

  •  జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 18–34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు.
  • జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు 18–35 ఏళ్ల వయసుతో పాటు పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు.  

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ 

ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ:    30.10.2019
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:    31.10.2019
ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ:    20.11.2019 (సాయంత్రం 5 వరకు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:    20.11.2019 (రాత్రి 11.59 వరకు)
హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ ప్రారంభం:    11.12.2019
పరీక్ష తేదీ:    22.12.2019

జూనియర్‌ లైన్‌మెన్, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ 
ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ:    21.10.2019
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:    22.10.2019
ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ:    10.11.2019 (సాయంత్రం 5 వరకు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:    10.11.2019 (రాత్రి 11.59 వరకు)
హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ ప్రారంభం:    05.12.2019
పరీక్ష తేదీ:    15.12.2019 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top