‘గురుకుల’ పరీక్షా విధానంలో మార్పులు | TSPSC changes in written tests of teacher posts | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ పరీక్షా విధానంలో మార్పులు

Jul 14 2017 12:43 AM | Updated on Sep 5 2017 3:57 PM

గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల విధానంలో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది.

ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్ల రాత పరీక్ష ఒకే పూట
సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల విధానంలో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. గురువారం ఈ మేరకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇదివరకు ప్రతి కేటగిరీలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించేలా రెండు పేపర్ల విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్రతి కేటగిరీలో ఒకే పేపర్‌గా రాత పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ జారీ చేసింది. ఈనెల 31న ఆర్ట్‌ టీచర్‌ పోస్టులకు ఉదయం జనరల్‌ స్టడీస్, మధ్యాహ్నం ఆర్ట్‌ అండ్‌ ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుందని పేర్కొనగా.. ఇప్పుడు దానిని మార్పు చేసింది.

31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్‌ స్టడీస్‌–ఆర్ట్‌ అండ్‌ ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల పరీక్షల పేపర్లలోనూ మార్పులు చేసింది. వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్‌ స్టడీస్‌–క్రాఫ్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జనరల్‌ స్టడీస్‌–మ్యూజిక్‌ అండ్‌ మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుందని వివరించింది. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్లో పొందవచ్చని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement