న్యాయ వ్యవస్థపై నమ్మకముంది..

Trust on legal system :azad wife padma - Sakshi

కోర్టు తీర్పు సంతోషాన్ని ఇచ్చింది..

ఆజాద్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని     ఆశిస్తున్నాను

కోర్టు ఆదేశాల అనంతరం మీడియాతో  ఆజాద్‌ భార్య పద్మ

సాక్షి, ఆదిలాబాద్‌: ‘ఈరోజు సంతోషాన్నిచ్చింది.. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్న ఆశ కలుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడింది. ఆజాద్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత 2013 నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం ఆదిలాబాద్‌కు 30 మార్లకు పైగా వచ్చాను. కేసులో ఈ మలుపు కీలకంగా భావిస్తున్నాను..’ అని మావోయిస్టు అగ్రనేత, 2010లో ఆదిలాబాద్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆజాద్‌ సహచరిణి పద్మ అన్నారు.

గురువారం ఆదిలాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆజాద్‌ మృతిచెందారని పోలీసులు చెప్పడాన్ని ఆమె మొదటి నుంచి తప్పుబడుతున్నారు. ఆజాద్‌ను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారని చెబుతూ వస్తోంది. తాజాగా గురువారం ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి(ఎస్సీ/ఎస్టీ కోర్టు) భారతిలక్ష్మి కింది కోర్టు(జ్యూడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు)ను ఆదేశించినట్లు పద్మ తరపున న్యాయవాది సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులపై న్యాయ విచారణ ప్రారంభించాలని ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top