
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సన్‌త్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేయగా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్.ఐ.పై దాడి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపద్ధర్మమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు తమపై దాడికి పాల్పడ్డరని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
టీడీపీ కార్యకర్తలు బస చేసిన లాడ్జిలో పోలీసులు సోదాలు నిర్వహించగా గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొన్నారు. రెండు కార్లలో సోదాలు నిర్వహించి రూ. 4.63 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.