'హామీలను టీఆర్ఎస్ నెరవేర్చడం లేదు' | trs government not makes true election promises, says digvijay singh | Sakshi
Sakshi News home page

'హామీలను టీఆర్ఎస్ నెరవేర్చడం లేదు'

Jan 22 2015 6:50 PM | Updated on Aug 14 2018 3:55 PM

ఎన్నికల హామీలను అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు.

హైదరాబాద్: ఎన్నికల హామీలను అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మట్లాడుతూ.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోలు, డిజిల్ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పటిష్టత ఎజెండాగా సాగే చర్చలు ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయని దిగ్విజయ్ తెలిపారు. పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిక అందిస్తామని దిగ్విజయ్ చెప్పారు. పెట్రోలు, డీజిల్లపై కేంద్రం, రాష్ట్రాలు వ్యాట్, ఎక్సైజ్ పన్నులు వినియోగదారులపై భారం పెంచుతున్నాయి అని దిగ్విజయ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement