'నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ' | training by police for unemployees | Sakshi
Sakshi News home page

'నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ'

Aug 19 2015 4:05 PM | Updated on Sep 3 2017 7:44 AM

నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్‌ దుగ్గల్ తెలిపారు.

భువనగిరి: నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్‌ దుగ్గల్ తెలిపారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా నివారణకు యువత ముందుకు రావాలని కోరారు. సారా తయారీకి అవసరమైన నల్లబెల్లం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  హెచ్చరించారు. హైవే పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎస్పీ దుగ్గల్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement