పర్యాటక కేంద్రంగా శ్రీపర్వతారామం | tourist destination sri parvathi ramam | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా శ్రీపర్వతారామం

May 15 2014 3:19 AM | Updated on Sep 2 2017 7:21 AM

నాగార్జునసాగర్‌లో శ్రీపర్వతారామాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనాఖన్ తెలి పారు.

నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్‌లో శ్రీపర్వతారామాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనాఖన్ తెలి పారు. బుద్ధపూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలోని సమావేశ మంది రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆమె మాట్లాడారు. అనంతరం వ్యాలీ ఆఫ్ స్థూపాస్, బుద్ధభూమి, బోధిసత్వ పార్కు జాతక ప్యానల్, శ్రీపర్వతారామం బ్రోచర్, మహోన్నత భారతీయుడు  పుస్తకాలను ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయం తీరంలో నిర్మించిన శ్రీపర్వతారామం, ప్రవేశద్వారం, బుద్ధచరిత వనం, స్థూపవనం, శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన బుద్ధవిగ్రహాలను శ్రీపర్వతారామానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప బౌద్ధ పర్యాటక స్థావర ంగా దేశ,విదేశీయులను ఆకర్షిస్తుందన్నారు.
 
 ఇప్పటికీ  ఈ ప్రాజెక్టు ఒక భాగం కూడా పూరి ్తకాలేదని రూ. 22 కోట్లు మంజూరు కాగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని తెలిపారు. ఇదిపూర్తయితే పర్యాటక అభివృది ్ధసంస్థకు ఆదాయాన్ని, స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఎండీ కే.ఎస్‌రెడ్డి, ఈడీ మధుసూదన్, ఏడీసీ.శ్రీనివాస్, రాష్ట్ర ఆర్ట్‌గ్యాలరీ డెరైక్టర్ శివనాగిరెడ్డి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి శకుంతల ,బొర్ర గోవర్దన్, సాగర్ డీవీఎమ్ వెంకటేశ్వర్‌రావు, డీటీఓ మహీధర్ పాల్గొన్నారు.

 అలరించిన
 చండాలిక నృత్యనాటిక
 బుద్ధజయంతి ఉత్సవాల భాగంగా పర్యాటక శాఖ నిర్వహించిన చండాలిక నృత్యనాటిక ఆహుతులను అలరించింది. అంటరానితనాన్ని పారదోలిన బుద్ధుని శిష్యుడు ఆనందునికి దప్పిక తీర్చడానికి ప్రకృతి అనే చండాలిక నీరు పోసిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. పద్మశ్రీ అవారు ్డ గ్రహిత  శోభానాయుడు, శిష్యురాలు శ్రీదేవి బృందం ప్రదర్శనను, ఈ నాటకాన్ని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆమెను ప్రశంసించారు.
 
 ప్రారంభమైన రైలు
 శ్రీపర్వతారామంలో పర్యాటకలను అ న్ని ప్రాంతాలకు తిప్పడానికి రైలును ప్రారంభించారు. పిల్లలు,పెద్దలు శ్రీపర్వతారామంలో రెలైక్కి సందడి చేశారు. సమావేశమందిరం చిన్నగా ఉండడంతో సందర్శకులంతా నిలబడే నాటక ప్రదర్శనను చూశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement