మధుకర్‌ మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం | tomorrow re-postmortem to madhukar's body | Sakshi
Sakshi News home page

మధుకర్‌ మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం

Apr 9 2017 12:44 AM | Updated on Aug 31 2018 8:34 PM

మంథని మధుకర్‌ మృతదేహానికి హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రీపోస్టుమార్టం జరగనుంది.

సాక్షి, పెద్దపల్లి: మంథని మధుకర్‌ మృతదేహానికి హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రీపోస్టుమార్టం జరగనుంది. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ఖననం చేసిన చోట అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఈ పోస్టుమార్టం జరపనున్నారు. ఈ కేసులో సోషల్‌ మీడియాలో జరిగిన.. జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు.. మధుకర్‌ కుటుంబసభ్యుల డిమాండ్‌ మేరకు మంథని మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.

కాకతీయ మెడికల్‌ కళాశాల చెందిన నిపుణుల సమక్షంలో ఈ నెల 7న రీపోస్టుమార్టం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ప్రభావితం చేస్తారని, వీరు చేయించే రీపోస్టుమార్టంపై నమ్మకం లేదని మధుకర్‌ తల్లి లక్ష్మి ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించింది. జడ్జి, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరపాలనే ఆమె అభ్యర్థనకు కోర్టు సమ్మతిస్తూ రీపోస్టుమార్టం జరపాలని ఆదేశించింది. దీంతో 10వ తేదీ ఉదయం 8 గంటలకు రీపోస్టుమార్టం చేయనున్నారు. కరీంనగర్‌ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అక్కడికి మధుకర్‌ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యను అనుమతించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement