మీకు ఓటుందా?

Toll Free Number For Voter Registration And Information - Sakshi

1950 టోల్‌ ఫ్రీకి ఫోన్‌ చేస్తే చెప్పేస్తారు  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మీరు ఓటరుగా నమోదయ్యారా? ఓటు ఉంటే.. ఎక్కడ ఓటరుగా నమోదయ్యారు? అనేది మీకు తెలియదా. ఏం పర్వాలేదు. వెంటనే మీ మొబైల్‌ నుంచి 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. కాల్‌ సెంటర్‌ ప్రతినిధులు ఇట్టే చెప్పేస్తారు. ఇందుకోసం మీరు చేయాల్సింది.. మీ ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ చెప్పడమే. ఒకవేళ ఓటు కలిగి లేకుంటే ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కావడానికి ఈనెల 2, 3 తేదీల్లో బూత్‌ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,300 పోలింగ్‌ బూత్‌లలో ఓటరు నమోదుగా కావొచ్చు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులు. వయసును నిర్దరించే ఏదేని ధ్రువీకరణ పత్రం ఉండటంతోపాటు స్థానికంగా నివసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు. ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారు చేర్పులు మార్పులు కూడా చేసుకోవచ్చని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top