నేడు ఉపపోరు | Today by election | Sakshi
Sakshi News home page

నేడు ఉపపోరు

Jul 4 2015 12:47 AM | Updated on Sep 17 2018 6:08 PM

నేడు ఉపపోరు - Sakshi

నేడు ఉపపోరు

జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిల్లో ఒక ఎంపీటీసీ స్థానం, సర్పంచ్‌లు 4, వార్డులు 19 ఉన్నాయి.

♦ నాలుగు సర్పంచ్, 19 వార్డులు,
♦ ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు
♦ తొలిసారిగా ఈవీఎంల వినియోగం
♦ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
 
 నల్లగొండ : జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిల్లో ఒక ఎంపీటీసీ స్థానం, సర్పంచ్‌లు 4, వార్డులు 19 ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)వినియోగించనున్నారు. మోత్కూరు మండలం మూసిపట్ల ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి.

18 వందల మంది ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగి ంచుకోనున్నారు. 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదేని అవాంతరాలు ఎదురైతే రీపోలింగ్ ఆదివారం నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8గంటలకు మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అలాగే నాలుగు సర్పంచ్ స్థానాలకు 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు, సర్పంచ్ స్థానాలకు కలిపి మొత్తం 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సర్పంచ్ ఎన్నికలకు 24 ఈవీఎంలు వినియోగించునున్నారు. వార్డులకు బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పోలింగ్ కోసం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement