రోడ్లకు తగ్గింపు

This time R & B There is nothing wrong with debt - Sakshi

ఈసారి బడ్జెట్‌లో రూ.2,218.73 కోట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: రోడ్లు, భవనాల శాఖ అద్భుతమైన పనితీరు చూపుతున్నా నిధులలేమితో ఈ ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారేలా కనిపిస్తోంది. గతేడాది రూ.5,575 కోట్లు కేటాయించి ఈసారి రూ.2218.73 కోట్లతో సరిపెట్టింది. గతేడాది కాంట్రాక్టర్లకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.  గత బడ్జెట్‌ లో రూ.5,575 కోట్లు కేటాయించినా వాస్తవానికి రూ.2,177 కోట్లు (ఇందులో రూ.1000 కోట్ల మేర అప్పులు) విడుదల చేసింది. మిగిలిన వాటికి అప్పు తెచ్చుకోమని చెప్పింది. మొత్తానికి ఈసారీ ఆర్‌ అండ్‌ బీకి అప్పులవేట తప్పేలా లేదు. ఈ నిధులపై ఆర్‌ అండ్‌ బీకి మరింత కష్టాలు తప్పవని శాఖ ఉద్యోగులూ వాపోతున్నారు. అద్దంలాంటి రోడ్లు ఉండాలన్న సీఎం నినాదం ఈ నిధులతో ఎలా సాకారమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర అవతరణ తర్వాత 3,155 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో 1,388 కి.మీల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీ.ల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయాల్సి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top