ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురి మృతి | Three Killed in road Accident in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురి మృతి

Jul 5 2016 8:14 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందారు.

నల్లగొండ : వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పెన్‌పహాడ్ మండలం చీదెల గ్రామస్థులు సూర్యాపేటలో జరుగుతున్న సువార్త మహాసభలకు హాజరయ్యారు. ఆ మహాసభలు ముగించుకుని... తిరిగి ఆటోలో స్వగ్రామానికి ప్రయాణమయ్యారు.

ఆ క్రమంలో  హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు... ఆ ఆటోను ఢీకొట్టింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement