
మృత పిండంతో మూడు రోజులు..
ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందకుండా పోతోంది.
ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో స్కా నింగ్ చేయగా కడుపులోనే పిండం మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతపిండాన్ని తొలగించాల్సిన వైద్యులు నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. తమది నిరుపేద కుటుంబమని, ఆర్థిక స్థోమత లేదని ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించాలని వైద్యులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు.
రాత్రంతా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలోనే గడిపారు. ఈ నెల 13న నల్లగొండ జిల్లా ఆ స్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లామని బాధిత దంపతులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి రిఫర్ చేశారు. సోమవారం కామినేని ఆస్పత్రికి వెళ్లేందుకు నల్లగొండ బస్టాండ్ వరకు వచ్చారు.