మూడు రోజుల పాటు గద్వాల బంద్ | three days gadwal bandh for special district | Sakshi
Sakshi News home page

మూడు రోజుల పాటు గద్వాల బంద్

Aug 25 2016 8:49 PM | Updated on Sep 4 2017 10:52 AM

మూడు రోజుల పాటు గద్వాల బంద్

మూడు రోజుల పాటు గద్వాల బంద్

గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు.

గద్వాల : జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాయకులు గురువారం ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణ రూపొందించారు.

ఇప్పటికే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి గద్వాలను జిల్లా చేయాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement