పెళ్లికి వెళుతున్నారా.. ఇళ్లు భద్రం | Thieves steals in four houses overnight | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళుతున్నారా.. ఇళ్లు భద్రం

Feb 2 2015 9:18 AM | Updated on Sep 2 2017 8:41 PM

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసిన దొంగలు వరుసగా నాలుగిళ్లో దోంగతనానికి పాల్పడ్డారు.

నల్గొండ(చౌటుప్పల్): తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసిన దొంగలు వరుసగా నాలుగిళ్లో దోంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని సుందరయ్యకాలనీలో జరిగింది. కాలనీలో నివాసముంటున్న ఎన్. జయరాజ్ కుటుంబం బంధువుల పెళ్లి నిమిత్తం గుంటూరు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంట్లో ఖర్చుల నిమిత్తం ఉంచిన ఐదు వేల రూపాయలతో పాటు 8 తులాల వెండి అపహరణకు గురైంది. ఇదే కాలినీలోని బి. యాదయ్య కుటుంబం జాతరకు వెళ్లి సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటికి చేరుకునే సరికి ఇంట్లో ఉన్న రూ. 18 వేలతో పాటు 10 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement